Breaking News

ప్రపంచ వృద్ధికి భారతదేశం ఒక కీలక ఇంజిన్


Published on: 14 Oct 2025 15:08  IST

ప్రస్తుత భారతదేశ ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా చెప్పారు. భారతదేశం ప్రపంచ వృద్ధికి ప్రధాన ఇంజిన్‌గా మారుతోందని కూడా ఆమె ప్రకటించారు. 2025 IMF-వరల్డ్ బ్యాంక్ వార్షిక సమావేశాలకు ముందు ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది IMF-వరల్డ్ బ్యాంక్ వార్షిక సమావేశాలు నిన్న(అక్టోబర్ 13, 2025) ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు అక్టోబర్ 18, 2025 వరకు వాషింగ్టన్ డీసీలో జరుగుతాయి.

Follow us on , &

ఇవీ చదవండి