Breaking News

సీఎం మాటలు నీటి మూటలేనా..?


Published on: 14 Oct 2025 18:57  IST

గురుకులాకు గ్రీన్ ఛానెల్‌లో నిధులు విడుదల చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటలు నీటి మూటలేనా..? అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రశ్నించారు. కమీషన్‌లు రావనే ఆయన గురుకులాలకు నిధులు కేటాయించడం లేదా..? అని విమర్శించారు. హామీలతో మభ్యపెట్టడం, ఆ తర్వాత మాట మార్చడమే రేవంత్ అనుసరిస్తున్న సిద్ధాంతమా..? అని నిలదీశారు. ఈ మేరకు హరీశ్‌రావు ఎక్స్‌ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి