Breaking News

నగరంలో రేవ్ పార్టీ.. భగ్నం చేసిన పోలీసులు


Published on: 16 Oct 2025 18:01  IST

మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలో రేవ్ పార్టీ కలకలం రేపింది. లింగంపల్లి గ్రామంలోని ఓ ఫాంహౌస్‌లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఫాం హౌస్‌పై పోలీసులు దాడి చేసి రేవ్‌పార్టీని భగ్నం చేశారు. రేవ్‌పార్టీలో 25 మంది పురుషులు, 8 మంది మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 2 లక్షల 40 వేల నగదు, 15 మొబైల్ ఫోన్లు, 11 వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అనంతరం రేవ్ పార్టీలో పాల్గొన్న వారిని మంచాల పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి