Breaking News

పాకిస్తాన్‌కు దెబ్బ మీద దెబ్బ..


Published on: 17 Oct 2025 17:38  IST

పొరుగు దేశం ఆప్ఘనిస్తాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్‌కు భారీ దెబ్బ తగిలింది. పాక్ ఆర్మీకి తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) చుక్కలు చూపిస్తోంది. ఆర్మీ క్యాంపులపై ఆత్మాహుతి దాడికి పాల్పడింది. శుక్రవారం మిర్ అలీ జిల్లా నార్త్ వాజిరిస్తాన్‌లోని ఆర్మీ క్యాంపులపై ఈ ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఏడుగురు పాక్ ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు రెండు శక్తివంతమైన బాంబ్ బ్లాస్టులు జరిగినట్లు కథనాలు రాస్తున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి