Breaking News

ఆ భూముల సేల్‌డీడ్స్‌ రద్దు చెల్లదు


Published on: 19 Oct 2025 12:03  IST

నిషేధిత జాబితాలో లేని భూముల సేల్‌ డీడ్స్‌ను సబ్‌రిజిస్ట్రార్‌ రద్దు చేయడం కుదరదని హైకోర్టు పేర్కొంది. సదరు భూములు తమవేనని ప్రభుత్వం భావిస్తే.. సివిల్‌ సూట్లు, అప్పీళ్ల ద్వారా టైటిల్‌ నిరూపించుకోవచ్చని, తర్వాత చట్టబద్ధంగా ఆ భూములను స్వాధీనం చేసుకోవచ్చని తెలిపింది. అంతే తప్ప.. సేల్‌డీడ్స్‌ను రద్దు చేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం బహదూర్‌గూడ గ్రామంలోని భూముల సేల్‌డీడ్స్‌ను కలెక్టర్‌ ఆదేశాలకు అనుగుణంగా సబ్‌రిజిస్ట్రార్‌ రద్దు చేయడాన్ని తప్పుబడుతూ ఈ వ్యాఖ్యలు చేసింది

Follow us on , &

ఇవీ చదవండి