Breaking News

చరిత్ర సృష్టించిన చంద్రయాన్ 2..


Published on: 19 Oct 2025 12:13  IST

చంద్రయాన్ 2లోని లూనార్ ఆర్బిటర్ చరిత్ర సృష్టించింది. చంద్రుడిపై సూర్యుడి నుంచి వెలువడే కరోనల్ మాస్ ఇంజెక్షన్ (సీఎమ్ఈ)ల ప్రభావం గురించి తొలిసారి కీలక సమాచారాన్ని సేకరించింది. ఆ విషయాలను ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) శనివారం స్వయంగా వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. ఆ పోస్టులో.. లూనార్ ఆర్బిటర్‌లోని అస్మోస్‌ఫెరిక్ కంపోజిషన్ ఎక్స్‌ప్లోరర్ ద్వారా కరోనల్ మాస్ ఇంజెక్షన్‌పై పరిశోధన చేయటం సాధ్యమైందని ఇస్రో తెలిపింది.

Follow us on , &

ఇవీ చదవండి