Breaking News

హరీష్‌కు మంత్రి అడ్లూరి ఛాలెంజ్


Published on: 21 Oct 2025 14:33  IST

మాజీ మంత్రి హరీష్ రావుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఛాలెంజ్ విసిరారు. కేబినెట్‌పై బీఆర్‌ఎస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని.. కేబినెట్ సమావేశంలో వ్యక్తిగత అంశాలు చర్చ చేయలేదని తాను ప్రమాణం చేస్తానని మంత్రి స్పష్టం చేశారు. అలాగే ఈ వ్యవహారంపై మాజీ మంత్రికి సవాల్ విసిరారు మంత్రి. ‘సిద్దిపేట వెంకటేశ్వర ఆలయంలో ప్రమాణం చేద్దామా? హరీష్ సెంటిమెంట్‌గా భావించే దేవుడిపై ప్రమాణం చేయగలడా? ఇద్దరం తడిబట్టలతో ప్రమాణం చేద్దామా? అంటూ మంత్రి అడ్లూరి పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి