Breaking News

హమాస్‌కు ట్రంప్‌ స్ట్రాంగ్ వార్నింగ్‌


Published on: 21 Oct 2025 14:58  IST

సుదీర్ఘకాల యుద్ధం అనంతరం ఇజ్రాయెల్‌- హమాస్‌ ల మధ్య ఇటీవల శాంతి ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఒప్పందం ఉల్లంఘనకు గురవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను అనుకుంటే.. గాజాలో ఖాళీ చేయించిన ప్రాంతాల్లోకి తిరిగి వెళ్లి హమాస్‌ను అంతం చేయమని ఇజ్రాయెల్‌ను కోరతానని వ్యాఖ్యానించారు. ఎయిర్‌ఫోర్స్‌వన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ హెచ్చరికలు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి