Breaking News

ప్రజలు ఇబ్బంది పడొద్దు: మంత్రి నారాయణ


Published on: 23 Oct 2025 14:43  IST

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మున్సిపల్ కమిషనర్లను మంత్రి నారాయణ అప్రమత్తం చేశారు. గురువారం నాడు మున్సిపల్ కమిషనర్లు, ఉన్నతాధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలని ఆదేశించారు. ఇంజనీరింగ్ , పారిశుద్ధ్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి