Breaking News

చిరంజీవికి కోర్టులో ఊర‌ట‌..


Published on: 24 Oct 2025 11:02  IST

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి సిటీ సివిల్‌ కోర్టులో ఊరట లభించింది. ఆయన అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం ఫొటోలు, బిరుదులు వాడుకోవడాన్ని నిరోధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన వ్యక్తిత్వ, ప్రచార హక్కులకు రక్షణ కల్పిస్తూ జడ్జి ఎస్‌.శశిధర్‌ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ఈ ఉత్తర్వుల ప్రకారం..  ఏ సంస్థ కూడా చిరంజీవి పేరు, ‘మెగాస్టార్‌’, ‘చిరు’ వంటి బిరుదులు, ఆయన ఫొటోలు, వాయిస్‌ను వ్యాపార ప్రకటనల కోసం వినియోగించకూడదు.

Follow us on , &

ఇవీ చదవండి