Breaking News

మెక్సికో యువతిని వరించిన మిస్ యూనివర్స్ కిరీటం


Published on: 21 Nov 2025 15:28  IST

మిస్ యూనివర్స్ 2025 కిరీటాన్ని మెక్సికోకు చెందిన ఫాతిమా బాష్ అందుకున్నారు. థాయ్‌లాండ్‌లో నాంథబురిలోని ఇంపాక్ట్ ఛాలెంజర్ హాల్‌‌లో జరిగిన ఈ తుది పోటీల్లో ఈ మిస్ యూనివర్స్ కిరీటాన్ని ఫాతిమా బాష్ సొంతం చేసుకున్నారు. భారత కాలమానం ప్రకారం ఉదయం 6: 30 గంటలకు ఈ మిస్ యూనివర్స్ పోటీలు ప్రారంభమైనాయి. ఈ పోటీల్లో భారత్ నుంచి పాల్గొన్న మణిక విశ్వకర్మ టాప్ 30కు చేరారు. కానీ ఆమె టాప్ 12కు అర్హత సాధించలేక పోయారు.

Follow us on , &

ఇవీ చదవండి