Breaking News

సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌కు 20 బోగీలు


Published on: 25 Nov 2025 12:26  IST

సికింద్రాబాద్‌-తిరుపతి మార్గంలో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ బుధవారం నుంచి 20 బోగీలతో పరుగులు పెట్టనుంది. ప్రస్తుతం 2 ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌, 14 ఏసీ చైర్‌కార్‌లతో కలిపి మొత్తం 16బోగీలతో నడుస్తున్న వందేభారత్‌కు అదనంగా మరో 4 ఏసీ చైర్‌కార్లను శాశ్వత ప్రాతిపదికన జత చేయాలని దక్షిణమధ్యరైల్వే నిర్ణయించింది.  ఉన్న సీట్ల సంఖ్యకు అదనంగా మరో 312 సీట్లు ప్రయాణికులకు అందుబాట్లోకి రానున్నాయి. కాగా, ఈ మార్గంలో వందేభారత్‌కు స్టాపేజీలు, వేళల్లో ఎటువంటి మార్పులేదని సీపీఆర్‌ఓ శ్రీధర్‌ వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి