Breaking News

రికార్డు సృష్టించిన జడేజా


Published on: 25 Nov 2025 18:17  IST

గువాహటి వేదికగా టీమిండియా-సౌతాఫ్రికా మధ్య రెండో టెస్టు కొనసాగుతోంది. ఇప్పటికే రెండో ఇన్నింగ్స్ ఆడిన సఫారీ సేన ఐదు వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసి డిక్లేర్ ఇచ్చింది. ఇందులో భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు తీశాడు. ఈ క్రమంలో జడ్డూ(Ravindra Jadeja) రికార్డు సృష్టించాడు. టెస్టు క్రికెట్‌లో దక్షిణాఫ్రికాపై 50 వికెట్లు సాధించిన ఐదో భారత బౌలర్‌గా నిలిచాడు.ఈ జాబితాలో జడేజా కంటే ముందు అనిల్ కుంబ్లే, జవగల్ శ్రీనాథ్, హర్భజన్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్ ఉన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి