Breaking News

అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌కు మాతృవియోగం


Published on: 26 Nov 2025 10:45  IST

అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌ తల్లి చింతకుంట రత్నమ్మ (83) కన్నుమూశారు. ఇవాళ(బుధవారం) తెల్లవారుజామున 3:39 గంటలకు ఆమె తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా రత్నమ్మ వృద్ధాప్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అనంతరం వారి స్వగ్రామం పోట్లదుర్తికి తీసుకెళ్లారు. పోట్లదుర్తిలో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున ఆమె తుదిశ్వాస విడిచారు. రత్నమ్మ మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.

Follow us on , &

ఇవీ చదవండి