Breaking News

ఇండోనేషియా దీవుల్లో 6.3 తీవ్రతతో భూకంపం..


Published on: 27 Nov 2025 13:51  IST

ఇండోనేషియా దేశంలోని సుమత్రా దీవులకు మరో ఉపద్రవం వచ్చిపడింది. గత కొన్ని రోజులుగా తుఫాను, భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్న సుమత్రా దీవుల్లో ఇప్పుడు భూకంపం సంభవించింది. ఈ రోజు (గురువారం) ఉదయం 6.3 తీవ్రత కలిగిన భూకంపం అక్కా ప్రాంతం సమీపంలో ఏర్పడింది. 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.అయితే, భూకంపం తీవ్రమైనది అయినప్పటికీ, సునామి ముప్పు లేదని అధికారులు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి