Breaking News

ఇమ్రాన్‌ ఖాన్‌ మరణించారంటూ వార్తలు..


Published on: 02 Dec 2025 14:04  IST

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ వ్యవస్థాపకుడు ఇమ్రాన్‌ ఖాన్‌ హత్యకు గురైనట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. రావల్పిండి లోని అదియాలా జైలులో ఆయనను చిత్రహింసలకు గురిచేసి చంపివేసినట్లు కథనాలు వెలువడ్డాయి. పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌, నిఘా సంస్థ ఐఎస్‌ఐ సంయుక్తంగా కుట్రకు పాల్పడి ఇమ్రాన్‌ ఖాన్‌ను హత్య చేసినట్లు బలూచిస్థాన్‌ విదేశీ వ్యవహారాల శాఖ ఆరోపించింది. ఈ ఆరోపణలను రావల్పిండిలోని అదియాలా జైలు అధికారులు ఖండించారు. 

Follow us on , &

ఇవీ చదవండి