Breaking News

ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు పడిగాపులు..


Published on: 03 Dec 2025 14:41  IST

ఇండిగో సంస్థకు చెందిన పలు విమానాల్లో సాంకేతిక లోపం తలెత్తింది. మంగళవారం రాత్రి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కేరళకు బయలుదేరాల్సిన విమానాల్లో ఒక్కసారిగా సాంకేతిక లోపం ఏర్పడింది. దాంతో ఈ విమానాలను రద్దు చేసింది. దీంతో గమ్యస్థానాలు చేరుకోవాల్సిన దాదాపు 1000 మంది ప్రయాణికులు.. గత రాత్రి నుంచి ఈ ఎయిర్ పోర్ట్‌లోనే పడిగాపులు కాస్తున్నారు. ఇండిగో సంస్థ సిబ్బంది తీరుపై ప్రయాణికులు మండిపడుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి