Breaking News

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్..


Published on: 03 Dec 2025 16:07  IST

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లాలో బుధవారం భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్, కోబ్రా భద్రతా బలగాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. పశ్చిమ బస్తర్ డివిజన్ ప్రాంతంలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య భీకర ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఆందోళన కొనసాగుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి