Breaking News

కాకర.. చేదుకాదు తీపి..!


Published on: 05 Dec 2025 12:34  IST

చేదైన కాకర తియ్యటి లాభాలు పంచుతోంది. మార్కెట్‌లో ధరలు ఆశాజనకంగా పలుకుతుండడంతో అన్నదాతకు లాభాల పంట పండుతోంది. కిలో రూ.50 వరకు అమ్ముడవుతున్నాయి. మండలంలో ఏడాది పొడవునా కూరగాయ పంటలు సాగుచేసి, బెంగళూరు, చెన్నై మార్కెట్లకు తరలిస్తుంటారు. ఈ ఏడాది ఖరీఫ్‌ నుంచి రబీ ప్రారంభం వరకు కూరగాయలు సాగుచేసిన రైతులు నష్టాలబాట పట్టారు. కొన్నిరోజులుగా కూరగాయల ధరలు పెరుగుతున్నాయి.దీంతో అన్నదాత హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి