Breaking News

కిలో అరటిపండ్లు 50 పైసలే..


Published on: 05 Dec 2025 17:58  IST

కిలో అరటి పండ్లు కేవలం 50 పైసలు మాత్రమేనని.. ఏపీలో అరటి రైతుల కష్టాలను వివరిస్తూ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ చేసిన ట్వీట్‌పై ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఆ వార్తలను ఖండించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్‌ విభాగం ట్విట్టర్‌ (ఎక్స్‌) వేదికగా వివరణ ఇచ్చింది. కిలో అరటిపండ్లు కేవలం 50 పైసలకు మాత్రమే అమ్ముడు అవుతున్నాయంటూ వైఎస్‌ జగన్‌ తన ట్విట్టర్ ఖాతాలో చెప్పడం పూర్తిగా సత్యదూరమని పేర్కొంది.

Follow us on , &

ఇవీ చదవండి