Breaking News

కూలిన సైనిక హెలికాప్టర్‌ .. ఐదుగురు మృతి


Published on: 09 May 2025 18:35  IST

శ్రీలంకలో శుక్రవారం ఒక సైనిక హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు మరణించినట్లు అధికారులు ఒక ప్ర కటనలో తెలిపారు. సైన్యం, వైమానిక దళానికి చెందిన 12మందిని మిలటరీ పెరేడ్‌ కోసం తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వైమానిక ప్రతినిధి ఎరాండా గీగనాగే తెలిపారు. కొలంబోకు ఈశాన్యంగా 280 కిలోమీటర్లు దూరంలో ఉన్న మదురు ఓయాలోని రిజర్వాయర్‌లో కూలిపోయిందని అన్నారు. సైన్యాన్ని బయటకు తీసి, ఆస్పత్రికి తరలించామని అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి