Breaking News

మృత్యుంజయుడు.. ఆ బాలుడు!


Published on: 10 May 2025 18:52  IST

కృష్ణా జిల్లాలో విజయవాడ నుంచి కంకిపాడు బస్టాండ్‌కు వస్తున్న ఆర్టీసీ బస్సును చూసుకోకుండా ఓ ఆరేళ్ల బాలుడు రహదారి దాటేందుకు ప్రయత్నించాడు. డ్రైవర్‌ అప్రమత్తమై సడన్‌బ్రేక్‌ వేశారు. బస్సు ముందు భాగం బాలుడిని వెంట్రుకవాసిలో తాకేలా సమీపించడం.. బాలుడు టైరు చక్రంపై తూలడం.. అదృష్టవశాత్తు కుడి వైపునకు పడడం క్షణాల్లో జరిగాయి. ప్రత్యక్షంగా చూసినవారు మాత్రం బాలుడు బస్సు చక్రం కింద పడిపోయాడని ఆందోళన చెందుతుండగానే లేచి నడుచుకుంటూ బంధువుల వద్దకు వచ్చాడు.

Follow us on , &

ఇవీ చదవండి