Breaking News

ఫుల్‌ జోష్‌లో స్టాక్‌ మార్కెట్లు..


Published on: 12 May 2025 12:24  IST

దేశీయ మార్కెట్లు నేడు ఫుల్‌ జోష్‌లో ఉన్నాయి. భారీ లాభాల్లో కదలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు, భారత్‌-పాక్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం వంటి పరిణామాలతో బుల్‌ పరుగులు తీస్తోంది. దాంతో సెన్సెక్స్‌ ఏకంగా 2200 పాయింట్లకు పైగా పెరగ్గా.. నిఫ్టీ 24,500 మార్క్‌ పైన ట్రేడ్‌ అవుతోంది.ఉదయం 9.58 గంటల సమయంలో సెన్సెక్స్‌ 2288 పాయింట్ల లాభంతో 81,742 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 703 పాయింట్లు ఎగబాకి 24,711 దగ్గర కొనసాగుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి