Breaking News

అమెరికా-చైనా మధ్య కుదిరిన ట్రేడ్‌ డీల్‌..!


Published on: 12 May 2025 12:37  IST

ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య వివాదాన్ని తగ్గించే లక్ష్యంతో అమెరికా-చైనా మధ్య జరిగిన చర్చలు సానుకూలంగా ముగిసినట్లు తెలుస్తోంది. వాణిజ్య యుద్ధంలో నష్టాన్ని తగ్గించే దిశగా ట్రేడ్‌ డీల్‌కు ఇరుదేశాలు సుముఖత చూపించినట్లు సమాచారం. చైనాతో చర్చల్లో గణనీయమైన పురోగతి కన్పించిందని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ తాజాగా ప్రకటించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను సోమవారం (అమెరికా కాలమానం ప్రకారం) మీడియాకు వెల్లడిస్తామని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి