Breaking News

జైపూర్‌ క్రికెట్‌ స్టేడియానికి బాంబు బెదిరింపులు..


Published on: 12 May 2025 17:46  IST

జైపూర్‌లోని సవాయ్‌ మాన్సింగ్‌ స్టేడియానికి ఈరోజు బాంబు బెదిరింపులు వచ్చినట్లు స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ అధికారిక ఈమెయిల్‌ ఐడీకి ఈ బెదిరింపు మెయిల్‌ వచ్చినట్లు అదనపు ఎస్పీ లలిత్‌ శర్మ చెప్పారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని స్టేడియాన్ని ఖాళీ చేయించారు. డాగ్‌ స్క్వాడ్‌, బాంబ్‌ స్క్వాడ్‌ సాయంతో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ లభించలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్పీ లలిత్‌ శర్మ వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి