Breaking News

ఆటకు వీడ్కోలు పలికిన సైనా నెహ్వాల్


Published on: 20 Jan 2026 13:37  IST

భారత బ్యాడ్మింటన్ దిగ్గజం సైనా నెహ్వాల్ ఆటకు వీడ్కోలు పలికారు. మహిళల బ్యాడ్మింటన్‌కు మార్గదర్శిగా నిలిచి ఎన్నో అత్యుత్తమ విజయాలు అందుకున్న సైనా(Saina Nehwal).. తాను ఇక ఆడలేనని ఓ పాడ్‌కాస్ట్ వేదికగా చెప్పారు. దీర్ఘకాలిక గాయాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఆర్థరైటిస్ వచ్చింది.. కార్టిలేజ్ పూర్తిగా డ్యామేజ్ అయింది. ఇక నేను ఆ స్థాయిలో ఆడలేనని నా తల్లిదండ్రులు, కోచ్‌లకు చెప్పాల్సి వచ్చింది అని సైనా చెప్పారు..

Follow us on , &

ఇవీ చదవండి