Breaking News

బేగంపేట ఫ్లైఓవర్‌పై ప్రమాదం..


Published on: 21 Jan 2026 11:54  IST

బేగంపేట ఫ్లైఓవర్‌పై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు నియంత్రణ కోల్పోయి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి కారు గాల్లోకి లేచి రోడ్డుపై బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి