Breaking News

కూలిన మిలటరీ శిక్షణ విమానం..


Published on: 21 Jan 2026 15:31  IST

ఉత్తరప్రదేశ్‌ ప్రయాగ్ రాజ్‌లో మిలటరీ శిక్షణ విమానం కూలింది. ప్రయాగ్ రాజ్ నగర శివారులోని చెరువులో ఈ శిక్షణ విమానం కూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందగానే.. ఆర్మీ ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. చెరువులోని ఎయిర్ క్రాఫ్ట్‌ నుంచి పైలట్లను బయటకు తీశారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి