Breaking News

ట్రావెల్స్ బస్సు-కంటైనర్ ఢీకొని ముగ్గురి మృతి


Published on: 22 Jan 2026 11:19  IST

నంద్యాల జిల్లా శిరివెళ్లమెట్ట దగ్గర కర్నూలు-చిత్తూరు 40వ జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్  బస్సు, కంటైనర్ లారీ ఢీకొని ముగ్గురు మృతిచెందారు. బస్సు టైర్ ఒక్కసారిగా పేలిపోవడంతో డివైడర్‌ను దాటి వెళ్లిపోయి.. ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. దీంతో బస్సులో మంటలు చెలరేగి లారీకి సైతం అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో కడప జిల్లాకు చెందిన బస్సు డ్రైవర్ భాస్కర్, కంటైనర్ లారీలోని డ్రైవర్, క్లీనర్‌లు క్యాబిన్‌లో చిక్కుకుపోయి సజీవ దహనం అయ్యారు.

Follow us on , &

ఇవీ చదవండి