Breaking News

ప్రపంచ రెండో రద్దీ నగరం బెంగళూరు


Published on: 23 Jan 2026 10:37  IST

ప్రపంచంలో రెండో రద్దీ నగరంగా (ట్రాఫిక్‌లో) దేశ ఐటీ రాజధాని, సిలికాన్‌ సిటీగా పేరొందిన బెంగళూరు నిలిచింది. అంతర్జాతీయ లొకేషన్‌ టెక్నాలజీ కంపెనీ టామ్‌టామ్‌ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ అంశాన్ని పేర్కొంది. 2025లో బెంగళూరు ట్రాఫిక్‌ సమస్యలను ఎదుర్కొనే నగరాలలో రెండో స్థానంలో నిలిచినట్టు ప్రకటించింది. అత్యంత ట్రాఫిక్‌ కలిగిన నగరాలలో మెక్సికో సిటీ తొలిస్థానంలో ఉండగా ఐర్లండ్‌లోని డబ్లిన్‌ నగరం మూడోస్థానంలో నిలిచింది.

Follow us on , &

ఇవీ చదవండి