Breaking News

రైల్వే శాఖతో పోరాడి విజయం


Published on: 27 Jan 2026 17:52  IST

ఎంట్రెన్స్ పరీక్ష కోసం ఓ విద్యార్థిని ఏడాదిపాటు పడిన శ్రమ వృథా అయింది. న్యాయం కోసం ఆమె ఏకంగా రైల్వే శాఖపైనే పోరాటానికి దిగింది. ఏడేళ్ల పాటు పోరాటం చేసి.. చివరకు విజయం సాధించింది. రైల్వే నుంచి రూ.9 లక్షల పరిహారం పొందింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌‌లో చోటుచేసుకుంది. రైలు ఆలస్యం కారణంగా పరీక్ష రాయకపోవడంతో తాను ఏడాది కాలాన్ని నష్టపోయానంటూ జిల్లా వినియోగదారుల కమిషన్‌కు(Consumer commission) ఫిర్యాదు చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి