Breaking News

కత్తి కంటే డ్రగ్స్‌ ప్రమాదం


Published on: 28 Jan 2026 12:46  IST

సమాజంలో కత్తి, కర్ర వంటి ఆయుధాల కంటే మాదకద్రవ్యాలు (డ్రగ్స్‌) అత్యంత ప్రమాదకరమని హోంమంత్రి అనిత అభిప్రాయపడ్డారు. డ్రగ్స్‌ తీసుకోవాలని స్నేహితులు బలవంతం చేసినప్పుడు ‘నో’ చెప్పకపోవడం వల్ల చాలామంది యువకులు చిక్కుల్లో పడుతున్నారని అన్నారు. ఎన్టీఆర్‌ పోలీసు కమిషనరేట్‌లో పనిచేసే ఐదుగురు మహిళా పోలీసులు ‘డ్రగ్స్‌పై దండయాత్ర’ పేరుతో చేపట్టిన సైకిల్‌ ర్యాలీని మంగళవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో హోంమంత్రి ప్రారంభించారు.

Follow us on , &

ఇవీ చదవండి