Breaking News

అండగా నిలవండి


Published on: 29 Jan 2026 11:35  IST

ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి అండగా నిలవాలని అమిత్‌ షాను పవన్‌ కోరారు. కేంద్ర బడ్జెట్‌లో ఈ మేరకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అమిత్‌ షాను ఆయన అధికారిక నివాసంలో కలిసి.. రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు.

Follow us on , &

ఇవీ చదవండి