Breaking News

రెండు లారీలు ఢీ.. డ్రైవర్ సజీవదహనం


Published on: 29 Jan 2026 11:45  IST

కత్తిపూడి వద్ద జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఓ లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. 16వ నంబర్ జాతీయ రహదారిపై లారీ యూటర్న్ తీసుకుంటుండగా.. అదే సమయంలో వేగంగా వస్తున్న మరో లారీ ఢీకొట్టింది. దీంతో ఓ లారీలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దాంతో డ్రైవర్ సజీవ దహనమయ్యాడు.ఆ రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

Follow us on , &

ఇవీ చదవండి