Breaking News

ఆ ఎమ్మెల్యేలు బ్లాక్‌మెయిల్‌ చేస్తే కుదరదు


Published on: 29 Jan 2026 14:21  IST

బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రె్‌సలో చేరిన ఎమ్మెల్యేలు పార్టీనే బ్లాక్‌మెయిల్‌ చేయాలనుకుంటే కుదరదని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌ చెప్పారు. వారి నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకులను కూడా సమన్వయం చేసుకోవాల్సిందేనన్నారు. పాత, కొత్త నాయకులను సమన్వయం చేయాల్సిన బాధ్యత ఇన్‌ఛార్జి మంత్రులపైనే ఉందన్నారు. గాంధీభవన్‌లో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య సమన్వయ కమిటీని త్వరగా వేయాలన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి