Breaking News

జగన్ హయాంలో ఫిష్ ఆంధ్ర పేరుతో దోచుకున్నారు..


Published on: 29 Jan 2026 15:39  IST

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలోని ఐదేళ్లల్లో మత్స్యకారులకు తీరని అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. వారికి కేటాయించిన డబ్బులు ఇతర వాటికి ఉపయోగించారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో వల, తెప్ప ఏవీ ఇవ్వలేదని దుయ్యబట్టారు.చిరిగిన వలను కుట్టుకోవడానికి‌ కూడా నిధులు ఇవ్వలేదని విమర్శించారు.ఫిష్ ఆంధ్ర పేరుతో కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆగ్రహించారు.

Follow us on , &

ఇవీ చదవండి