Breaking News

మాపై చేసిన ఆరోపణలపై కోర్టును ఆశ్రయిస్తాం


Published on: 29 Jan 2026 15:59  IST

టీటీడీ దేవస్థానానికి సంబంధించి కల్తీ నెయ్యి అంశంపై సుప్రీంకోర్టు నియమించిన సిట్.. నెల్లూరు ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ సమర్పించిందని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) తెలిపారు. ఫైనల్ చార్జ్‌షీట్‌లో నెయ్యిలో కల్తీ జరిగిందని, కానీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పిందని ప్రస్తావించారు. వైసీపీ హయాంలో స్వామివారికి సమర్పించే ప్రసాదంలో కూడా నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్ వాడారని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారని గుర్తుచేశారు.

Follow us on , &

ఇవీ చదవండి