Breaking News

అచ్చంపేటలో65 జంటలు సామూహిక వివాహాలు

నాగర్‌కర్నూలుకు చెందిన మున్సిపాలిటీ కౌన్సిలర్ గోపిశెట్టి శివ (అప్ప శివ) తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం నవంబర్ 16, 2025న అచ్చంపేటలో ఉచిత సామూహిక వివాహాలు విజయవంతంగా నిర్వహించారు. 


Published on: 17 Nov 2025 16:09  IST

నాగర్‌కర్నూలుకు చెందిన మున్సిపాలిటీ కౌన్సిలర్ గోపిశెట్టి శివ (అప్ప శివ) తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం నవంబర్ 16, 2025న అచ్చంపేటలో ఉచిత సామూహిక వివాహాలు విజయవంతంగా నిర్వహించారు. నవంబర్ 16, 2025 ఆదివారం, అచ్చంపేట పట్టణంలోని BK ప్యాలెస్ ఫంక్షన్ హాల్‌లో జరిగింది.మొత్తం 65 జంటలు ఈ సామూహిక వివాహాల ద్వారా వివాహ బంధంతో ఒక్కటయ్యాయి. ముఖ్య అతిథులు ఈ వేడుకకు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, అతని సతీమణి డాక్టర్ చిక్కుడు అనురాధ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.అచ్చంపేట చరిత్రలో ఇలాంటి ఉచిత సామూహిక వివాహాలు జరగడం ఇదే మొదటిసారి అని నిర్వాహకులు మరియు స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఈ కార్యక్రమం గొప్ప అవకాశాన్ని కల్పించింది.

Follow us on , &

ఇవీ చదవండి