Breaking News

పురాతన జంతువు దవడ ఎముక లభ్యమైంది. చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్ రెడ్డి ఈ అవశేషాన్ని గుర్తించి, పరిశీలించారు.

శిలాయుగ కాలానికి చెందినదని, మానవులు ఆహారంగా వాడిన జంతువుల ఎముక గుర్తించిన చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్ రెడ్డి


Published on: 01 Apr 2025 22:21  IST

జనగామ జిల్లా కేంద్రానికి సమీపంలోని పొట్టిగుట్ట ప్రాంతంలో పురాతన జంతువు దవడ ఎముక లభ్యమైంది. చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్ రెడ్డి ఈ అవశేషాన్ని గుర్తించి, పరిశీలించారు.

పంట భూమిలో దున్నకాలు చేస్తుండగా, సుమారు రెండు ఫీట్ల లోతున ఈ దవడ ఎముక బయటపడిందని ఆయన తెలిపారు. ఎముకను పరిశీలించినప్పుడు, దానికి నాలుగు పళ్లు ఉండడంతో పాటు చివర్లో ఒక చిన్న రంధ్రం కూడా కనిపించిందని చెప్పారు. ఈ ఎముక పొడవు, ఆకారం చూసినప్పుడు, ఇది మేక జాతికి చెందినదిగా అనుమానిస్తున్నామని తెలిపారు.

ఆవాస ప్రాంతంలో లభించిన ఈ ఎముక శిలాయుగ కాలానికి చెందినదని,అప్పటి మానవులు ఆహారంగా వాడిన జంతువుల అవశేషాల్లో భాగమై ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. సాధారణంగా, కాలంతో పాటు ఎముక రంగు మారుతూ తేలికగా మారుతుందని, ఇది ఇప్పటికీ తెల్లగా ఉండడం ఆసక్తికరంగా ఉందని పేర్కొన్నారు.

ఈ ఎముక ఎంత పురాతనమైనదో నిర్ధారించుకోవాలంటే కార్బన్ డేటింగ్ పరీక్షలు చేయాల్సి ఉంటుందని, అయితే ఈ ప్రక్రియ ఖరీదైనదిగా ఉండటంతో విదేశాల్లో నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. పురావస్తు శాఖ ఆసక్తి చూపిస్తే, ఈ అవశేషాన్ని వారికి అందజేయడానికి సిద్ధంగా ఉన్నామని వివరించారు.

Follow us on , &

ఇవీ చదవండి