Breaking News

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులుతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

రాష్ట్రంలో ఎక్కువ మంది అర్హుల కోసం రాజీవ్ యువ వికాసం పథకాన్ని విస్తృతంగా అమలు చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.


Published on: 01 Apr 2025 23:36  IST

జనగామ రూరల్: రాష్ట్రంలో ఎక్కువ మంది అర్హుల కోసం రాజీవ్ యువ వికాసం పథకాన్ని విస్తృతంగా అమలు చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, ఇతర అధికారులుతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఐదు లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర వెనుకబడిన వర్గాల నిరుద్యోగ యువత ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఈ పథకాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. రుణ మాఫీ విధానం గురించి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

దరఖాస్తు చేసిన అనంతరం, అవసరమైన పత్రాలను పరిధిని బట్టి మున్సిపాలిటీ, ఎంపీడీఓ కార్యాలయాల్లో సమర్పించాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, బీసీ, ఎస్సీ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు రవీందర్, విక్రమ్, ప్రేమ కళ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాధవిలత తదితరులు పాల్గొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి