Breaking News

రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి

రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మంగళవారం (నేడు) సూర్యాపేటలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు.


Published on: 01 Apr 2025 23:11  IST

జనగామ: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మంగళవారం (నేడు) సూర్యాపేటలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు.

ఈ ప్రారంభోత్సవం అనంతరం, జిల్లాలో కలెక్టర్ రిజ్వాన్ బాషా పర్యవేక్షణలో బియ్యం పంపిణీ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే జిల్లాకు అవసరమైన సన్న బియ్యంలో 50% కంటే ఎక్కువ భాగం రేషన్ దుకాణాలకు చేరుకున్నట్లు సమాచారం.

జిల్లాలో మొత్తం 12 మండలాల్లో 335 రేషన్ దుకాణాలు ఉన్నాయి. మొత్తం 1,61,472 రేషన్ కార్డులు ఉండగా, వీటిలో అంత్యోదయ రేషన్ కార్డులు 10,754, అన్నపూర్ణ కార్డులు 90, తెల్ల రేషన్ కార్డులు 1,50,628 ఉన్నాయి. ఈ కార్డులకు సంబంధించిన మొత్తం 4,87,864 మంది లబ్దిదారులకు ఒక్కొక్కరికి నెలకు ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం అందించనున్నారు. మొత్తం 3,104.764 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయించబడింది.

Follow us on , &

ఇవీ చదవండి