Breaking News

ఇటలీకి చెందిన ప్రముఖ ఏరోస్పేస్ సంస్థ లియోనార్డోతో అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ వ్యూహాత్మక భాగస్వామ్యం

అదానీ గ్రూప్ నేడు (ఫిబ్రవరి 3, 2026) హెలికాప్టర్ల తయారీ రంగంలోకి అధికారికంగా అడుగుపెట్టింది.ఇటలీకి చెందిన ప్రముఖ ఏరోస్పేస్ సంస్థ లియోనార్డో (Leonardo) తో అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది.


Published on: 03 Feb 2026 15:56  IST

అదానీ గ్రూప్ నేడు (ఫిబ్రవరి 3, 2026) హెలికాప్టర్ల తయారీ రంగంలోకి అధికారికంగా అడుగుపెట్టింది.ఇటలీకి చెందిన ప్రముఖ ఏరోస్పేస్ సంస్థ లియోనార్డో (Leonardo) తో అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది.భారత సాయుధ దళాల అవసరాల కోసం అత్యాధునిక హెలికాప్టర్లను దేశీయంగానే తయారు చేయడం. రాబోయే పదేళ్లలో భారత్‌లో వెయ్యికి పైగా హెలికాప్టర్ల అవసరం ఉంటుందని అంచనా.

ప్రాథమికంగా లియోనార్డోకు చెందిన AW169M మరియు AW109 TrekkerM వంటి అత్యాధునిక హెలికాప్టర్ల తయారీపై ఈ సంస్థలు దృష్టి సారించనున్నాయి.కేవలం తయారీ మాత్రమే కాకుండా, హెలికాప్టర్ల నిర్వహణ (MRO), విడిభాగాల ఉత్పత్తి మరియు పైలట్లకు శిక్షణ ఇచ్చే కేంద్రాన్ని కూడా భారత్‌లో ఏర్పాటు చేయనున్నారు.

న్యూఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో అదానీ డిఫెన్స్ డైరెక్టర్ జీత్ అదానీ, సీఈఓ అశీష్ రాజ్‌వంశీ పాల్గొన్నారు. 'ఆత్మనిర్భర్ భారత్'లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. 

Follow us on , &

ఇవీ చదవండి