Breaking News

తెలంగాణలో కొత్త విద్యుత్ కనెక్షన్ల జారీ ప్రక్రియలో భారీ మార్పులను అమలులోకి తెచ్చింది.

తెలంగాణలో కొత్త విద్యుత్ కనెక్షన్ల జారీ ప్రక్రియలో ఫిబ్రవరి 5, 2026 నుంచి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (TGERC) భారీ మార్పులను అమలులోకి తెచ్చింది.


Published on: 04 Feb 2026 18:59  IST

తెలంగాణలో కొత్త విద్యుత్ కనెక్షన్ల జారీ ప్రక్రియలో ఫిబ్రవరి 5, 2026 నుంచి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (TGERC) భారీ మార్పులను అమలులోకి తెచ్చింది. గతంలో విద్యుత్ స్తంభాలు, లైన్ల కోసం దూరాన్ని బట్టి ఫీజు వసూలు చేసేవారు. ఇకపై దూరం ప్రాతిపదికన కాకుండా, కనెక్షన్ లోడ్ ఆధారంగా స్థిరమైన ఛార్జీలు (Fixed Charges) మాత్రమే వసూలు చేస్తారు.

గృహ వినియోగదారులకు (Domestic) కొత్త ఛార్జీలు:

1 కిలోవాట్ వరకు: ₹500.

1 - 5 కిలోవాట్ల వరకు: ₹500 తో పాటు ప్రతి అదనపు కిలోవాట్‌కు ₹600 చొప్పున (గరిష్టంగా ₹3,500 వరకు).

రైతులకు ఊరటనిస్తూ వ్యవసాయ కనెక్షన్ల కోసం ప్రతి కిలోవాట్‌కు కేవలం ₹1,000 మాత్రమే ఖరారు చేశారు. దీనివల్ల గతంలో ఉన్న వేల రూపాయల అదనపు భారం తప్పుతుంది.

హైదరాబాద్ వంటి నగరాల్లో గదుల (BHK) సంఖ్య ఆధారంగా కనీస లోడ్‌ను నిర్ణయిస్తున్నారు (ఉదా: 2 BHK కి 5 kW, 3 BHK కి 10 kW).మల్టీ స్టోరీడ్ బిల్డింగ్‌లకు కంబైన్డ్ కాంట్రాక్టెడ్ లోడ్ (Combined Load) ఆధారంగా సర్వీస్ లైన్ ఛార్జీలు వర్తిస్తాయి.గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చే ప్రతి కొత్త కనెక్షన్‌కు స్మార్ట్ మీటర్లను తప్పనిసరి చేశారు.10 కిలోవాట్ల వరకు సోలార్ ప్యానెల్స్ పెట్టుకునే వారికి ఇకపై టెక్నికల్ ఫీజిబిలిటీ స్టడీ (Technical Feasibility Study) అవసరం లేదు. 

Follow us on , &

ఇవీ చదవండి