Breaking News

ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం..33 జిల్లాల్లో మండలానికి ఒకటి చొప్పున ఓపెనింగ్

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 200 ఇండ్లకు స్లాబ్ పూర్తి. ఈనెలాఖరుకల్లా వెయ్యి ఇండ్లు పూర్తవుతాయంటున్న ఆఫీసర్లు


Published on: 23 May 2025 08:44  IST

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వచ్చే నెల 2వ తేదీన గృహనిర్మాణ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా "ఇందిరమ్మ ఇల్లు" పథకం కింద నిర్మిస్తున్న ఇళ్లలో కనీసం ఒక్కో మండలంలో ఓ ఇంటికి గృహప్రవేశం చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇప్పటికే మొదటి విడత కింద మంజూరైన ఇళ్లలో 20,000 ఇండ్లకు పైగా నిర్మాణం ప్రారంభమైంది. వాటిలో 5,200 ఇండ్లు బేస్‌మెంట్ దశ పూర్తయ్యాయి. మరో 300 ఇండ్లకు గోడలు పూర్తై స్లాబ్ పనులు సిద్ధంగా ఉన్నాయి. 200 ఇండ్లకు స్లాబ్ దాకా పనులు పూర్తవ్వగా ప్రస్తుతం ప్లాస్టరింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ నెలాఖరుకు వేలు వరకూ స్లాబ్ పనులు పూర్తవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.ప్రముఖ హౌసింగ్ సంస్థల డైరెక్టర్లు ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయుతున్నారు. ఇప్పటివరకు ₹53.64 కోట్లను ప్రభుత్వమే నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేసింది.

హైదరాబాద్ మహానగర పరిధిలో పలు లక్షలమంది పౌరులు స్థలం లేక ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇందిరమ్మ పథకం కింద GHMC పరిధిలో దరఖాస్తు చేసిన 10,66,953 మందిలో కేవలం 18,000 మందికే సొంత స్థలం ఉన్నట్టు సర్వేలో తేలింది. వీరి కోసం ప్రభుత్వ భూముల్లో జీ ప్లస్ 3 (G+3) మోడల్‌తో అపార్టుమెంట్ల నిర్మాణం చేపట్టనున్నారు.GHMC కమిషనర్, హైదరాబాద్ కలెక్టర్ 15 ప్రాంతాల్లో ప్రభుత్వం భూములను గుర్తించి నివేదిక పంపించారు. ఒక్కో ఎకరాలో 300 ఇళ్లు నిర్మించేలా ప్రణాళిక వేస్తున్నారు. అంతకుమించిన గృహ నిర్మాణం చేయాలంటే మౌలిక సదుపాయాలపై భారమైన ఖర్చు పడతుందని అధికారులు పేర్కొంటున్నారు.

ప్రభుత్వం రెండో విడత కింద 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో మొదటి దశలో 71,000 ఇళ్లను మంజూరు చేయగా, 47,000కి పైగా కలెక్టర్లు సాంక్షన్ చేశారు. రెండో దశలో 2.08 లక్షల ఇళ్లను మంజూరు చేసి, ఇప్పటికే లక్ష ఇళ్లకు శంకుస్థాపన పూర్తయింది. పథకాన్ని దశల వారీగా అమలు చేస్తూ, కలెక్టర్లు లబ్ధిదారులకు ఇండ్లు మంజూరు చేస్తున్నారు.

ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను ప్రభుత్వమే రీచ్‌ల ద్వారా ఉచితంగా సరఫరా చేస్తోంది. అంతేకాకుండా సిమెంట్, ఇనుమును మార్కెట్ ధర కంటే తక్కువకు ఇవ్వాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల సిమెంట్, స్టీల్ కంపెనీలతో సమావేశమై వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఇళ్లు నిర్మించనున్నట్లు ప్రభుత్వ ప్రతినిధులు వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement