Breaking News

సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా అన్ని గ్రూప్‌లకు వాయిస్‌ చాట్‌ ఫీచర్‌ని అందుబాటులోకి తెచ్చిన వాట్సప్‌.

సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా అన్ని గ్రూప్‌లకు వాయిస్‌ చాట్‌ ఫీచర్‌ని అందుబాటులోకి తెచ్చిన వాట్సప్‌.


Published on: 23 May 2025 18:38  IST

ఈ రోజుల్లో మెసేజ్ పంపాలన్నా, ఫొటోలు షేర్ చేయాలన్నా మొదట గుర్తుకువచ్చేది వాట్సప్. ఈ మెసేజింగ్ యాప్ తరచూ కొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటూనే ఉంది. తాజాగా, గ్రూప్ కాల్స్ కోసం రూపొందించిన వాయిస్ చాట్ ఫీచర్‌ను అన్ని గ్రూపులకు విస్తరించింది. ముందుగా ఈ ఫీచర్‌ను 33 మందికిపైగా సభ్యులు ఉన్న గ్రూపులకు మాత్రమే అందుబాటులోకి తెచ్చారు. కానీ ఇప్పుడు, సభ్యుల సంఖ్య ఎంత ఉన్నా ఎలాంటి పరిమితులు లేకుండా అన్ని గ్రూపుల్లో వాయిస్ చాట్‌ను ఉపయోగించుకునే వీలు కల్పించారు. వాయిస్ చాట్‌ను ఉపయోగించాలంటే: మీ వాట్సప్ గ్రూప్ చాట్ ఓపెన్ చేయండి చాట్ బాటమ్ (కింద) భాగంలో స్వైప్ అప్ చేయండి “Swipe up to chat” అనే ఆప్షన్ కనిపిస్తుంది దాన్ని కొద్ది సేపు నొక్కి ఉంచితే వాయిస్ చాట్ ప్రారంభమవుతుంది ఈ ఫీచర్ ఇప్పటికే చాలామంది Android మరియు iPhone యూజర్లకు అందుబాటులో ఉంది. మిగతా వినియోగదారులకు కూడా త్వరలోనే రానుంది. ఇది సాధారణ వాట్సప్ గ్రూప్ కాల్‌లతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. సాధారణంగా గ్రూప్ కాల్ వస్తే అందరికీ రింగ్‌టోన్ వినిపిస్తుంది. కానీ ఈ వాయిస్ చాట్ ప్రారంభమైతే: సైలెంట్ నోటిఫికేషన్ రూపంలో మాత్రమే సమాచారం వస్తుంది,ఎవరైనా సభ్యుడు కావాలంటే మధ్యలోనైనా చాట్‌లోకి జాయిన్ అవవచ్చు,ఇప్పటికే వాయిస్ చాట్‌లో ఉన్నవారికి ఇతరుల ప్రొఫైల్ పిక్స్ కనిపిస్తాయి, ఈ విధంగా ఇది చాలా సౌకర్యవంతమైన, ప్రైవేట్ తరహా కమ్యూనికేషన్‌లా పనిచేస్తుంది. వాట్సప్‌లో ఉండే మరో ముఖ్యమైన విషయం ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్. ఈ వాయిస్ చాట్స్‌కీ అదే భద్రతా విధానాన్ని వర్తింపజేశారు. అంటే, మీరు మాట్లాడేది మీకూ, మీ గ్రూప్ మెంబర్స్‌కే వినిపిస్తుంది. మూడవ పక్షం వినే అవకాశం ఉండదు. వాట్సప్ తరచూ తీసుకొస్తున్న ఈ విధమైన అప్‌డేట్లు వినియోగదారులకు మరింత ఉపయోగకరంగా మారుతున్నాయి. చిన్న సమూహాలు అయినా, పెద్ద గ్రూపులైనా – ఇప్పుడు అందరూ సౌకర్యవంతంగా వాయిస్ చాట్స్‌ను ఉపయోగించవచ్చు. ఇది ముఖ్యంగా ఫ్యామిలీ గ్రూపులు, టీం డిస్కషన్లకు చాలా బాగా ఉపయోగపడనుంది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement