Breaking News

సిద్దిపేట జిల్లాలో పులి సంచారం..


Published on: 07 Feb 2026 18:35  IST

సిద్దిపేట జిల్లాలోని దూల్మిట్ట మండలం కూటిగల్, భైరన్‌పల్లి శివారులో పులి సంచారం తీవ్ర కలకలం రేపింది. మద్దూర్ మండలం లధ్నూర్, అమ్మాపూర్ గ్రామాల్లో పులి.. లేగ దూడలపై దాడిచేసి చంపడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు.. పులి పాదముద్రలను పరిశీలించారు.పులి పాదముద్రల ఆధారంగా యాదాద్రి జిల్లా నుంచి సిద్దిపేటలోకి ప్రవేశించినట్లు అటవీ అధికారులు గుర్తించారు.

Follow us on , &

ఇవీ చదవండి