Breaking News

తిరుమలేశుడి సేవలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి


Published on: 09 Feb 2026 12:53  IST

ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టీసీడీ శేఖర్‌ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో ఆలయంలోకి వెళ్లిన ఆయన ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలవిరాట్టును దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపానికి చేరుకున్న న్యాయమూర్తికి వేదపండితులు ఆశీర్వచనం చేయగా.. అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు.

Follow us on , &

ఇవీ చదవండి