Breaking News

ఆర్టీసీ డిపోల్లో ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు


Published on: 11 Feb 2026 14:45  IST

గ్రేటర్‌ జోన్‌ పరిధిలోని అన్ని ఆర్టీసీ డిపోల్లో ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు అందుబాటులోకి తీసుకువచ్చేలా ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఇప్పటికే కంటోన్మెంట్‌, మియాపూర్‌, రాణిగంజ్‌, హయత్‌నగర్‌, హెచ్‌సీయూ డిపోల్లో ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు నడుస్తున్నాయి. త్వరలో కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్‌, మిధాని, మహేశ్వరం డిపోల్లో ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాబోయే రెండేళ్లలో ఓఆర్‌ఆర్‌ పరిధిలో ఎలక్ర్టిక్‌ బస్సులు మాత్రమే నడపాలని ప్రభుత్వం ప్రకటించడంతో గ్రేటర్‌ జోన్‌ను పూర్తిగా ఈవీ జోన్‌గా మార్చేదిశగా ఆర్టీసీ ముందుకెళ్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి