Breaking News

బీసీసీఐ కీలక నిర్ణయం..ఆసియా కప్‌ నుంచి భారత్‌ దూరం.!


Published on: 19 May 2025 14:55  IST

ఇటీవల నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జరిగే ఆసియా కప్‌ టోర్నీ నుంచి వైదొలగాలని నిర్ణయించినట్లు పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ మేరకు దీనిపై ఇప్పటికే ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ)కి భారత బోర్డు సమాచారం ఇచ్చినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి.దీంతో ఈ ఏడాది సెప్టెంబరులో జరిగే పురుషుల ఆసియా కప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అయిన టీమ్‌ఇండియా ఆడే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి