Breaking News

కూకట్‌పల్లిలో ఆక్రమణలను కూల్చేసిన హైడ్రా..


Published on: 19 May 2025 15:51  IST

కూకట్‌పల్లి పరిధి హైదర్‌నగర్‌లోని డైమండ్ ఎస్టేట్ లేఅవుట్‌ను ఆక్రమణదారుల చెర నుంచి హైడ్రా విడిపించింది. ఇక్కడ ప్లాట్లను కొనుగోలు చేసిన 79 మంది బాధితులకు న్యాయం చేసింది. గత సంవత్సరం సెప్టెంబర్‌లో 79 మంది బాధితులకు ఈ స్థలం చెందుతుందని హైకోర్టు తీర్పునిచ్చింది. అయినా కబ్జాదారులు స్థలాన్ని ఖాళీ చేయకపోవడంతో బాధితులంతా హైడ్రాకు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో హైడ్రా సోమవారం ఉదయం భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాల తొలగింపు చేపట్టింది.

Follow us on , &

ఇవీ చదవండి